నీ దేహమునకు దీపము నీ కన్నే
Unknown
October 01, 2018
నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగు మయమై యుండును
లూకా 11: 34
సహోదరి సహోదరులారా
మన దేహము దేవునివలన మనకు అనుగ్రహింపబడి, మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నది
మనము మన సొత్తు కాము
విలువపెట్టి కొనబడినవారము గనుక మన దేహముతో మనము దేవుని మహిమపరచవలసిన వారమై యున్నాము
భక్తుడు ఈ విధంగా అంటున్నాడు
నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము
వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము
నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము అని
ప్రియులారా
యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది
ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన నరులను పరిశీలించుచున్నాడు అని వ్రాయబడి ఉంది
ప్రసంగి ఈ విధంగా అంటున్నాడు
యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము అని
సహోదరి సహోదరులారా
మనము పైనున్న వాటిమీదనేగాని,
ఈ భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకోవడానికి వీలు లేదు
ఏలయనగా మనము మృతిపొందితిమి
మన జీవము క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడియున్నది.
మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదుము గనుక
మన ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడ
పరిత్యజించి, మనలను సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనివలసిన వారమై యున్నాము
ప్రియులారా
దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది
మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది
ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము
మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము

Reviewed by Unknown
on
October 01, 2018
Rating: