*మన జీవితంలో మనం ఏ పని చేయాలన్న మనకు జ్ఞానం కావాలి దేవుడు మనకిచ్చిన ప్రతీ బాద్యతను సక్రమంగా నిర్వర్తించాలన్న జ్ఞానం కావాలి
బైబిల్ ఈ విదంగా తేయజేస్తుంది
యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట జ్ఞానమునకు మూలము అని
దేవుడు సొలోమోనును రాజుగా నియమించాడు
అప్పుడు సొలొమోను ఏమాన్నాడో చూడండి
"నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి యున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు;
నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను; వారు విస్తరించియున్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాలదేశమును తనకీ చేయుటయు అసాధ్యము.
ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయ చేయుము." అని ప్రార్ధించాడు
దేవుడు సొలోమోను ప్రార్ధన ఆలకించి సొలొమోనుకు జ్ఞానాన్ని అనుగ్రహించాడు
మనం కూడా దేవునికి ప్రార్ధించినట్లయితే మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్దముగా ఉన్నాడు
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.
అలాగే బైబిల్ లొ ఈ విదంగా కూడా వ్రాయబడి ఉంది
యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే అని
చెడ్డవి చూస్తూ చెడ్డవి ఆలోచిస్తు చెడ్డవి చేస్తూ చెడుతనము కలిగి జీవిస్తూ ఉంటే మనం దేవుని దగ్గరనుండి జవాబులు పొందుకోలేము కాబట్టి చేసిన ప్రతీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకుని జీవితంలో ముందుకు సాగవలిసిందిగా మనవి
సామెతలు 9: 10;1 Kings(మొదటి రాజులు) 3:7,8,9;James(యాకోబు) 1:5;Proverbs(సామెతలు) 8:13
జ్ఞానం
Reviewed by Unknown
on
March 03, 2018
Rating:
No comments: