శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్య
నీ ప్రేమే నను గెల్చెనూ
విడువక నీ కృప నా యెడ కురుపించినావయ్యా
నీ కృపయే నను మార్చెను
నీ ప్రేమ ఉన్నతం నీ ప్రేమ ఆమృ తం
నీ ప్రేమ జుంటితేనె కన్నా మధురము
నీ ప్రేమ లోతులో నను నడుపు యేసయ్య
నీ ప్రేమ లోన నే వేరుపారి నీకై జీవించనా
ప్రేమతో ప్రేమతో యేసయ్య నిను వెంబడితును
ప‌్రేమతో ప్రేమతో యేసయ్య నిను ఆరాధింతూనూ
నా తల్లి గర్భము నందు నే పిండమునై యుండంగా సృష్ఠించి నిర్మించిన ప్రేమ
నా దినములలో ఒకటైన ఆరంభం కాకమునుపే
గ్రంథములో లికియించిన ప్రేమ
నా ఎముకలను నా అవయవములను వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ
తల్లి ఒడిలో నేను పాలు త్రాగుచున్నప్పుడు నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ
తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ
ప్రేమతో ప్రేమతో నీ కోసం నను స్రృజియించావయ ప్రేమతో ప్రేమతో ప్రేమతో నను మురిపెంగా లాలించావయ
నే ప్రభువును ఏరుగక యుండి అజ్ఞానములో
ఉన్నప్పుడు నను విడువక వెంటాడిన ప్రేమ
నా సృష్ఠి కర్తను గూర్చి స్మరనే నాలో లేనపుడు నా కోసం వేచి చూచిన ప్రేమ
బాల్య దినముల నుండి నను సంరక్షించి కంటి రెప్పలా నన్ను కాపాడిన ప్రేమ
యవ్వన కాలమున కృపతో నను కలిసి సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ
నే వెదకున్నను నాకు దొరకి నను బ్రతికించిన ప్రేమ
ప్రేమతో ప్రేమతో యేసయ్య నను దర్శించావయ ప‌్రేమతో ప్రేమతో ప్రేమతో నను ప్రత్యేక పరిచావేసయ్య
నే పాపినైయుoడగనె నాకై మరణించిన ప్రేమా
తన సొత్తుగ చేసుకున్న ప్రేమ
విలువె లేనట్టి నాకై తన ప్రాణం వెల చెల్లించి నా విలువను పెంచేసిన ప్రేమ
లోకమే నను గూర్చి చులకన చేసినను తన దృష్టిలో నేను గనుఢన్నా ప్రేమ
ఎవరు లేకున్న నేను నీకు సరిపోన నీ బహు ప్రియూడవని బలపరచిన ప్రేమ
నాముద్దు బిడ్డ నీవంటూ తెగ ముద్దాడిన ప్రేమ
యేసయ్య యేసయ్య నాపై ఇంత ప్రేమ ఏంటయ
యేసయ్య యేసయ్య యేసయ్య నను నీల మార్చేందులకేనయ
పలుమార్లు నే పడినప్పుడు బహుచిక్ఖులలోనున్నపుఢు కరుణించి పైకి లేపిన ప్రేమ
నేనే నిను చేశానంటూ నేనె బరియిస్తానంటూ నను చంకన ఎత్తుకున్న ప్రేమ
నా తప్పటడుగులను తప్పకుండ సరిచేసి తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ నన్ను బట్టి మారదుగా నన్ను చేరధీసెనుగ షరతుళే లేనట్టి నా తండ్రీ ప్రేమ తన కిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ
ప్రేమతో ప్రేమతో నను మరల సమకుర్చావేసయ్య
ప‌్రేమతో ప్రేమతో ప్రేమతో నీ సాక్షంగా నిలబెట్టవయ్యా
కష్టాల కొలుముల్లోన కన్నీటి లోయల్లోన నా తోడై ధైర్యపరచిన ప్రేమ
చెలరేగిన తుపానులలో ఎడతెగని పోరాటములో తన మాటతొ శాంతి నిచ్చిన ప్రేమ
లోకమే మారినను మనుషులే మరచినను మరువనే మరువదుగా నా యేసు ప్రేమ
తల్లిలా ప్రేమించి తండ్రిలా బోదించి ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ
క్షణ మాత్రమైన నను వీడి పోని వాత్సల్యయత గల ప్రేమ
ప్రేమతో ప్రేమతో నా విశ్వాసం కాపాడవయ్యా
ప్రేమతో ప్రేమతో ప్రేమతో బంగారంలా మెరిపించివావయ్యా
ఊహించ లేనటువంటి కృపలను నాపై కురిపించి
నా స్థితి గతి మార్చివేసిన ప్రేమ
నా సొంత శక్తితొ నేను ఎన్నడును పొందగలేని అందలమును ఎక్కించిన ప్రేమ
పక్షిరాజు రెక్కలపై నిత్యము నను మోస్తు శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ
పర్వతాలపై ఎపుడు క్రీస్తువార్త చాటించే సుందరపు పాదాములు నాకిచ్చిన ప్రేమ
తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ
ప్రేమతో ప్రేమతో శాశ్వతం జీవం నాకిచ్చావయా
ప్రేమతో ప్రేమతో ప్రేమతో నను చిరకాలం ప్రేమిస్తావయా
jesus the everlasting love
Reviewed by Unknown
on
March 03, 2018
Rating:
No comments: