Recent Posts

Seo Services

చింతించడం మానివేయి


* చింతించడం మానివేయి
ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణము,వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?
ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?
కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.
ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.
(మత్తయి సువార్త 6:25,26,27,31,32,33
కీర్తనల గ్రంథము 91:4)

చింతించడం మానివేయి చింతించడం మానివేయి Reviewed by Unknown on March 02, 2018 Rating: 5

No comments:

ads 728x90 B
Powered by Blogger.