మిత్రుడా, నీవు చిరునవ్వుతో యుండడం మరచిపోయావా? నీ ముఖం ఎప్పుడు కోపంతోను దుఃఖంతోను యున్నట్లే కనబడుచున్నదా? క్రొత్త వారి మీద కోపపడుచు మిత్రులతో కఠినంగా మాట్లాడుచున్నావా? ఇదే నీ పరిస్థితి అయితే దయచేసి ముందుకు చదువు, లేదా అద్దంలో నీ ముఖం ఒకసారి చూచుకొని నిన్ను నీవు పరిక్షించుకో క్రైస్తవుడు ఈ లోకంలో సంతోషంగా యుండే కారణాలు బోలెడున్నాయి.అతడు దేవుని బిడ్డ, క్రైస్తవుడు క్రీస్తు రక్తముచే విమోచింపబడిన వాడు అతడు నూతన సృష్టిగా మార్పు చెందినవాడు అతడు దేవుని తండ్రి గాను క్రీస్తు రక్షకునిగాను ఎంచి పరలోక విషయంలో ఆత్మసంబంధమైన ప్రతీ ఆశీర్వాదమును అనుభవించును (ఎఫేసి1:6) అతని నడిపించడానికి క్రైస్తవుడు క్రీస్తును,మార్గదర్శిగా వాక్యపు వెలుగును ప్రోత్సహించడానికి తోటి సోదరులను, పరలోకంలో ఒక గృహమును కలిగియున్నాడు.క్రైస్తవుడు క్రీస్తునుండి జీవమును, సమృద్దియైన జీవమును కలిగియున్నాడు (యోహను 10:10) అందువలన ఎల్లప్పుడు సంతోషించుడి, ప్రభువునందు ఆనందించుడియని క్రైస్తవులకు చెప్పబడింది (1థెస్స 5:16) ఆనందించడానికి అన్ని కారణాలుండగా మనం ఎందుకు సంతోషంగా యుండుటలేదు? అస్తమానము మనలను గూర్చియే ఆలోచించుకొనుట వలననా? మనం దేవుని గూర్చి తోటి సహోదరుని గూర్చి ఆలోచించుట నిర్లక్ష్యం చేసినందునా? మనలను గూర్చియే ఆలోచించు కొనుచున్నందునా మన పరిసర సంగతులను నిర్లక్ష్యం చేయుదుము. మనలను ఈ లోకం సరిగా గుర్తించడం లేదని బాధ పడ్తాము దీనికి పరిష్కారము? పైకి చూడు! కొలత లేని రీతిగా దేవుడు మనలను ఆశీర్వదించారు నీకున్న దానిని గూర్చి కృతజ్ఞత కలిగి యుండుము. దేవుని అనుగ్రహమును బట్టి ఆనందించుము బయటికి చూడు ఇతరుల అవసరాలను గుర్తించు యేసు యొక్క మాదిరిని అనుసరించుము ఆయన ఇట్లు చెప్పారు "మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను" (మత్తయి 20:28); (యోహను 13:4-17)
సంతోషముగా ఉండు
Reviewed by Unknown
on
March 19, 2018
Rating:
No comments: