Recent Posts

Seo Services

ప్రార్దన మనలను శక్తివంతులనుగా చేస్తుంది


మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి
మత్తయి 26: 41

సహోదరి సహోదరులారా 
మనం ఈ లోకంలో జీవిస్దున్నాము కానీ 
ఈ లోకం మనలో ఉండడానికి వీలులేదు
అనగా ఈ లోకానుసారంగా మనం జీవించడానికి
ఈ లోకసంబందమైనవి మనలో ఉండడానికి వీలులేదు
రోమీయులకు వ్రాసిన పత్రిక 1:1 వచనం ప్రకారం దేవుడు మనలను పరిశుద్దముగా ఉండుటకు పిలిచాడు ఆ పిలుపుకు తగ్గట్టుగా మనం జీవించవలసిన వారమై ఉన్నాము
భక్తుడు ఈ విదంగా అంటున్నాడు
సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన ఆలకించును అని
సాదుసుందర్ సింగ్ అనే భక్తుడు ఈ విదంగా అన్నాడు
ఒక పక్షికి రెండు రెక్కలేలాగో ఒక విశ్వాసికి ప్రార్థన వాక్యం అలాంటివి"అని
దావీదు దినమునకు ముమ్మారు ప్రార్దించేవాడు
దినమునకు ఏడుమారులు దేవున్ని స్థుతించేవాడు
అలాగే దానియేలు దినమునకు ముమ్మారు  ప్రార్దించేవాడు
ప్రార్దన మనలను శక్తివంతులనుగా చేస్తుంది
సైతాను తెచ్చె ప్రతీ శోదనను మనం జయించాలన్న
పాపిష్టి లోకంలో మనం పరిశుద్దముగా జీవించాలన్న
ప్రార్దనా శక్తిని మనం కలిగి ఉండాలి
అలాగే మనం దేవునితో  ఏకాంతగా గడపడం  అలవాటు చేసుకోవాలి
యేసు పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను అని వ్రాయబడి ఉంది
సహోదరి సహోదరులారా
మనము శక్తివంతులముగా ఉండాలని
పాపానికి రాజీపడకుండా బ్రతకాలని
జయజీవితాన్ని జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు.
ప్రార్దన మనలను శక్తివంతులనుగా చేస్తుంది ప్రార్దన మనలను శక్తివంతులనుగా చేస్తుంది Reviewed by Unknown on September 29, 2018 Rating: 5

No comments:

ads 728x90 B
Powered by Blogger.