Recent Posts

Seo Services

సంతోషముగా ఉండు

March 19, 2018

మిత్రుడా, నీవు చిరునవ్వుతో యుండడం మరచిపోయావా? నీ ముఖం ఎప్పుడు కోపంతోను దుఃఖంతోను యున్నట్లే కనబడుచున్నదా? క్రొత్త వారి మీద కోపపడుచు మిత్రులతో కఠినంగా మాట్లాడుచున్నావా? ఇదే నీ పరిస్థితి అయితే దయచేసి ముందుకు చదువు, లేదా అద్దంలో నీ ముఖం ఒకసారి చూచుకొని నిన్ను నీవు పరిక్షించుకో క్రైస్తవుడు ఈ లోకంలో సంతోషంగా యుండే కారణాలు బోలెడున్నాయి.అతడు దేవుని బిడ్డ, క్రైస్తవుడు క్రీస్తు రక్తముచే విమోచింపబడిన వాడు అతడు నూతన సృష్టిగా మార్పు చెందినవాడు అతడు దేవుని తండ్రి గాను క్రీస్తు రక్షకునిగాను ఎంచి పరలోక విషయంలో ఆత్మసంబంధమైన ప్రతీ ఆశీర్వాదమును అనుభవించును (ఎఫేసి1:6) అతని నడిపించడానికి క్రైస్తవుడు క్రీస్తును,మార్గదర్శిగా వాక్యపు వెలుగును ప్రోత్సహించడానికి తోటి సోదరులను, పరలోకంలో ఒక గృహమును కలిగియున్నాడు.క్రైస్తవుడు క్రీస్తునుండి జీవమును, సమృద్దియైన జీవమును కలిగియున్నాడు (యోహను 10:10) అందువలన ఎల్లప్పుడు సంతోషించుడి, ప్రభువునందు ఆనందించుడియని క్రైస్తవులకు చెప్పబడింది (1థెస్స 5:16) ఆనందించడానికి అన్ని కారణాలుండగా మనం ఎందుకు సంతోషంగా యుండుటలేదు? అస్తమానము మనలను గూర్చియే ఆలోచించుకొనుట వలననా? మనం దేవుని గూర్చి తోటి సహోదరుని గూర్చి ఆలోచించుట నిర్లక్ష్యం చేసినందునా? మనలను గూర్చియే ఆలోచించు కొనుచున్నందునా మన పరిసర సంగతులను నిర్లక్ష్యం చేయుదుము. మనలను ఈ లోకం సరిగా గుర్తించడం లేదని బాధ పడ్తాము దీనికి పరిష్కారము? పైకి చూడు! కొలత లేని రీతిగా దేవుడు మనలను ఆశీర్వదించారు నీకున్న దానిని గూర్చి కృతజ్ఞత కలిగి యుండుము. దేవుని అనుగ్రహమును బట్టి ఆనందించుము బయటికి చూడు ఇతరుల అవసరాలను గుర్తించు యేసు యొక్క మాదిరిని అనుసరించుము ఆయన ఇట్లు చెప్పారు "మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను" (మత్తయి 20:28); (యోహను 13:4-17)
సంతోషముగా ఉండు సంతోషముగా ఉండు Reviewed by Unknown on March 19, 2018 Rating: 5
March 14, 2018

Reviewed by Unknown on March 14, 2018 Rating: 5

telugu bible quotes for youth

March 03, 2018
telugu bible quotes for youth










telugu bible quotes for youth telugu bible quotes for youth Reviewed by Unknown on March 03, 2018 Rating: 5

జ్ఞానం

March 03, 2018

*మన జీవితంలో మనం ఏ పని చేయాలన్న మనకు జ్ఞానం కావాలి దేవుడు మనకిచ్చిన ప్రతీ బాద్యతను  సక్రమంగా నిర్వర్తించాలన్న జ్ఞానం కావాలి
బైబిల్ ఈ విదంగా తేయజేస్తుంది
యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట జ్ఞానమునకు మూలము అని
దేవుడు సొలోమోనును రాజుగా నియమించాడు
అప్పుడు సొలొమోను ఏమాన్నాడో చూడండి
"నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి యున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు;
 నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను; వారు విస్తరించియున్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాలదేశమును తనకీ చేయుటయు అసాధ్యము.
 ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయ చేయుము." అని ప్రార్ధించాడు
దేవుడు సొలోమోను ప్రార్ధన ఆలకించి సొలొమోనుకు జ్ఞానాన్ని అనుగ్రహించాడు
మనం కూడా దేవునికి ప్రార్ధించినట్లయితే మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్దముగా ఉన్నాడు
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.
అలాగే బైబిల్ లొ ఈ విదంగా కూడా వ్రాయబడి ఉంది
యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే అని
చెడ్డవి చూస్తూ చెడ్డవి ఆలోచిస్తు చెడ్డవి చేస్తూ చెడుతనము కలిగి జీవిస్తూ ఉంటే మనం దేవుని దగ్గరనుండి జవాబులు పొందుకోలేము కాబట్టి చేసిన ప్రతీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకుని జీవితంలో ముందుకు సాగవలిసిందిగా మనవి
సామెతలు 9: 10;1 Kings(మొదటి రాజులు) 3:7,8,9;James(యాకోబు) 1:5;Proverbs(సామెతలు) 8:13
 
జ్ఞానం  జ్ఞానం Reviewed by Unknown on March 03, 2018 Rating: 5

jesus the everlasting love

March 03, 2018

శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్య
నీ ప్రేమే నను గెల్చెనూ
విడువక నీ కృప నా యెడ కురుపించినావయ్యా
నీ కృపయే నను మార్చెను

నీ ప్రేమ ఉన్నతం నీ ప్రేమ ఆమృ తం
నీ ప్రేమ జుంటితేనె కన్నా మధురము
నీ ప్రేమ లోతులో నను నడుపు యేసయ్య
నీ ప్రేమ లోన నే వేరుపారి నీకై జీవించనా

ప్రేమతో  ప్రేమతో యేసయ్య నిను వెంబడితును
ప‌్రేమతో ప్రేమతో యేసయ్య నిను ఆరాధింతూనూ

నా తల్లి గర్భము నందు నే పిండమునై యుండంగా సృష్ఠించి నిర్మించిన ప్రేమ
నా దినములలో ఒకటైన ఆరంభం కాకమునుపే
గ్రంథములో లికియించిన ప్రేమ
నా ఎముకలను నా అవయవములను వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ
తల్లి ఒడిలో నేను పాలు త్రాగుచున్నప్పుడు నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ
తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ

 ప‌్రేమతో  ప్రేమతో  నీ కోసం నను స్రృజియించావయ  ప్రేమతో  ప‌్రేమతో  ప్రేమతో నను మురిపెంగా లాలించావయ

నే ప్రభువును ఏరుగక యుండి అజ్ఞానములో
ఉన్నప్పుడు నను విడువక  వెంటాడిన ప్రేమ
నా సృష్ఠి కర్తను గూర్చి స్మరనే నాలో లేనపుడు నా కోసం వేచి చూచిన ప్రేమ
బాల్య దినముల నుండి నను సంరక్షించి కంటి రెప్పలా నన్ను కాపాడిన ప్రేమ
యవ్వన కాలమున కృపతో నను కలిసి సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ
నే వెదకున్నను నాకు దొరకి నను బ్రతికించిన ప్రేమ 

 ప‌్రేమతో ప్రేమతో యేసయ్య నను దర్శించావయ       ప‌్రేమతో ప్రేమతో ప‌్రేమతో నను ప్రత్యేక పరిచావేసయ్య

నే పాపినైయుoడగనె నాకై  మరణించిన ప్రేమా
తన సొత్తుగ చేసుకున్న ప్రేమ                               
విలువె లేనట్టి నాకై తన ప్రాణం వెల చెల్లించి నా విలువను పెంచేసిన ప్రేమ
లోకమే నను గూర్చి చులకన చేసినను తన దృష్టిలో నేను గనుఢన్నా ప్రేమ
ఎవరు లేకున్న నేను నీకు సరిపోన నీ బహు ప్రియూడవని బలపరచిన ప్రేమ
నాముద్దు బిడ్డ నీవంటూ తెగ ముద్దాడిన ప్రేమ
యేసయ్య యేసయ్య నాపై ఇంత ప్రేమ ఏంటయ
యేసయ్య యేసయ్య యేసయ్య నను నీల మార్చేందులకేనయ

పలుమార్లు నే పడినప్పుడు బహుచిక్ఖులలోనున్నపుఢు కరుణించి పైకి లేపిన ప్రేమ
నేనే నిను చేశానంటూ నేనె బరియిస్తానంటూ నను చంకన ఎత్తుకున్న ప్రేమ
నా తప్పటడుగులను తప్పకుండ సరిచేసి తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ నన్ను బట్టి మారదుగా నన్ను చేరధీసెనుగ షరతుళే లేనట్టి నా తండ్రీ ప్రేమ తన కిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ
ప‌్రేమతో ప్రేమతో నను మరల సమకుర్చావేసయ్య
ప‌్రేమతో ప్రేమతో ప‌్రేమతో నీ సాక్షంగా నిలబెట్టవయ్యా

కష్టాల కొలుముల్లోన కన్నీటి లోయల్లోన నా తోడై ధైర్యపరచిన ప్రేమ
చెలరేగిన తుపానులలో ఎడతెగని పోరాటములో తన మాటతొ శాంతి నిచ్చిన ప్రేమ
లోకమే మారినను మనుషులే మరచినను మరువనే మరువదుగా నా యేసు ప్రేమ
తల్లిలా ప్రేమించి తండ్రిలా బోదించి ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ
క్షణ మాత్రమైన నను వీడి పోని వాత్సల్యయత గల ప్రేమ
ప్రేమతో ప్రేమతో నా విశ్వాసం కాపాడవయ్యా
ప్రేమతో ప్రేమతో ప్రేమతో బంగారంలా మెరిపించివావయ్యా

ఊహించ లేనటువంటి కృపలను నాపై కురిపించి
నా స్థితి గతి మార్చివేసిన ప్రేమ
నా సొంత శక్తితొ నేను ఎన్నడును పొందగలేని అందలమును ఎక్కించిన ప్రేమ
పక్షిరాజు రెక్కలపై నిత్యము నను మోస్తు శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ
పర్వతాలపై ఎపుడు క్రీస్తువార్త చాటించే సుందరపు పాదాములు నాకిచ్చిన ప్రేమ
తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ
ప్రేమతో ప్రేమతో శాశ్వతం జీవం నాకిచ్చావయా
ప్రేమతో ప్రేమతో ప్రేమతో నను చిరకాలం ప్రేమిస్తావయా

jesus the everlasting love jesus the everlasting love Reviewed by Unknown on March 03, 2018 Rating: 5

జయించువారికి

March 02, 2018
*జయించువారికి

*జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.
*జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు.
*జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.
*నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి(లేక, గైకొను వానికి) జనులమీద అధికారము ఇచ్చెదను.
*జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.
*జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.
*నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.
ప్రకటన గ్రంథము 2:7,11,17,26;3:5,12,21
జయించువారికి జయించువారికి Reviewed by Unknown on March 02, 2018 Rating: 5

చింతించడం మానివేయి

March 02, 2018

* చింతించడం మానివేయి
ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణము,వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?
ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?
కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.
ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.
(మత్తయి సువార్త 6:25,26,27,31,32,33
కీర్తనల గ్రంథము 91:4)

చింతించడం మానివేయి చింతించడం మానివేయి Reviewed by Unknown on March 02, 2018 Rating: 5
ads 728x90 B
Powered by Blogger.