Featured Posts

[Travel][feat1]

Recent Posts

Seo Services

నీ దేహమునకు దీపము నీ కన్నే

October 01, 2018
నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగు మయమై యుండును
లూకా 11: 34
సహోదరి సహోదరులారా
మన దేహము దేవునివలన మనకు అనుగ్రహింపబడి, మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నది
మనము మన సొత్తు కాము
విలువపెట్టి కొనబడినవారము గనుక  మన దేహముతో మనము దేవుని మహిమపరచవలసిన వారమై యున్నాము
భక్తుడు ఈ విధంగా అంటున్నాడు
నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము
వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము
నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము అని
ప్రియులారా
యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది
ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన నరులను పరిశీలించుచున్నాడు అని వ్రాయబడి ఉంది
ప్రసంగి ఈ విధంగా అంటున్నాడు
యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము అని
సహోదరి సహోదరులారా
మనము పైనున్న వాటిమీదనేగాని,
ఈ భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకోవడానికి వీలు లేదు
ఏలయనగా మనము మృతిపొందితిమి
మన జీవము క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడియున్నది.
మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదుము గనుక
మన ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడ
పరిత్యజించి, మనలను సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనివలసిన వారమై యున్నాము
ప్రియులారా
దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది
మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది
ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము
మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము



నీ దేహమునకు దీపము నీ కన్నే నీ దేహమునకు దీపము నీ కన్నే Reviewed by Unknown on October 01, 2018 Rating: 5

* పది ద్వారములు

September 30, 2018


1.The sheep gate గొర్రెల ద్వారం
యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి
2.The fish gate మత్య్సపు గుమ్మము
ఆత్మలను సంపాదిస్తు
3.The Old gate పాత గుమ్మము
విశ్వాసంలో కొనసాగుతు
4.The vally gate లోయ ద్వారం
శ్రమలను ఓర్చుకుంటు
5.The dung gate పెంట ద్వారం
ఎప్పటికప్పుడు నిన్ను నీవు సరిచేసుకుంటు
6.The fountain gate దార యొక్క గుమ్మం
పరిశుద్దాత్మ చేత నింపబడుతూ
7.The water gate నీటి గుమ్మం
వాక్యంతో ఉదకస్నానం చేయబడి
8.The horse gate గుర్రపు ద్వారం
దేవుని పని చేస్తు
9.The estern gate తూర్పు గుమ్మం
దేవుడు వచ్చేటప్పుడు ఆయనను ఎదుర్కొంటు
10.The inspection gate పరీక్షా ద్వారం
దేవుడిచ్చిన తీర్పులో బహుమతి పొందుకునేల బ్రతుకు

* పది ద్వారములు * పది ద్వారములు Reviewed by Unknown on September 30, 2018 Rating: 5

Daily bible verse in telugu

September 30, 2018

Daily bible verse in telugu Daily bible verse in telugu Reviewed by Unknown on September 30, 2018 Rating: 5

Daily bible verse in telugu

September 29, 2018

Daily bible verse in telugu Daily bible verse in telugu Reviewed by Unknown on September 29, 2018 Rating: 5

ప్రార్దన మనలను శక్తివంతులనుగా చేస్తుంది

September 29, 2018

మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి
మత్తయి 26: 41

సహోదరి సహోదరులారా 
మనం ఈ లోకంలో జీవిస్దున్నాము కానీ 
ఈ లోకం మనలో ఉండడానికి వీలులేదు
అనగా ఈ లోకానుసారంగా మనం జీవించడానికి
ఈ లోకసంబందమైనవి మనలో ఉండడానికి వీలులేదు
రోమీయులకు వ్రాసిన పత్రిక 1:1 వచనం ప్రకారం దేవుడు మనలను పరిశుద్దముగా ఉండుటకు పిలిచాడు ఆ పిలుపుకు తగ్గట్టుగా మనం జీవించవలసిన వారమై ఉన్నాము
భక్తుడు ఈ విదంగా అంటున్నాడు
సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన ఆలకించును అని
సాదుసుందర్ సింగ్ అనే భక్తుడు ఈ విదంగా అన్నాడు
ఒక పక్షికి రెండు రెక్కలేలాగో ఒక విశ్వాసికి ప్రార్థన వాక్యం అలాంటివి"అని
దావీదు దినమునకు ముమ్మారు ప్రార్దించేవాడు
దినమునకు ఏడుమారులు దేవున్ని స్థుతించేవాడు
అలాగే దానియేలు దినమునకు ముమ్మారు  ప్రార్దించేవాడు
ప్రార్దన మనలను శక్తివంతులనుగా చేస్తుంది
సైతాను తెచ్చె ప్రతీ శోదనను మనం జయించాలన్న
పాపిష్టి లోకంలో మనం పరిశుద్దముగా జీవించాలన్న
ప్రార్దనా శక్తిని మనం కలిగి ఉండాలి
అలాగే మనం దేవునితో  ఏకాంతగా గడపడం  అలవాటు చేసుకోవాలి
యేసు పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను అని వ్రాయబడి ఉంది
సహోదరి సహోదరులారా
మనము శక్తివంతులముగా ఉండాలని
పాపానికి రాజీపడకుండా బ్రతకాలని
జయజీవితాన్ని జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు.
ప్రార్దన మనలను శక్తివంతులనుగా చేస్తుంది ప్రార్దన మనలను శక్తివంతులనుగా చేస్తుంది Reviewed by Unknown on September 29, 2018 Rating: 5

Daily bible verse in telugu

September 28, 2018

Daily bible verse in telugu Daily bible verse in telugu Reviewed by Unknown on September 28, 2018 Rating: 5

Daily bible verse in telugu 28.09.2018

September 27, 2018

Daily bible verse in telugu 28.09.2018 Daily bible verse in telugu 28.09.2018 Reviewed by Unknown on September 27, 2018 Rating: 5
ads 728x90 B
Powered by Blogger.